మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు ర‌చ్చ చేస్తున్న అభిమానులు…

December 2, 2021

మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు ర‌చ్చ చేస్తున్న అభిమానులు…

బ్ర‌మ‌రాంభ‌లో సినిమా చూసిన దిల్‌రాజు, శిరీష్, తార‌క‌ర‌త్న‌

మ‌రి కాసేప‌ట్లో భ్రమరాంబకు బాల‌య్య‌..

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే కొన్ని థియేట‌ర్స్‌లో బెనిఫిట్ ఫోలు ప‌డ్డాయి. తెల్లవారు జామునుంచే అభిమానుల హంగామా మొదలైంది. ఇక ఈ సినిమా పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది.

తెల్లవారుజామున 4 గంటలకు కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అఖండ బెనిఫిట్ షో మొదలైంది. దిల్‌రాజు, శిరీష్‌, తారకరత్న, చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి సినిమా చూస్తున్నారు. మ‌రి కాసెపట్లో బాల‌కృష్ణ థియేట‌ర్ కు చేరుకోనున్నాడ‌ని తెలుస్తోంది.

మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించార‌ట‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపంలో న‌ట విశ్వ‌రూపం చూపించార‌ట‌. అస‌లు మ‌నిషి దేవుడిని ఎందుకు న‌మ్మాలి, ఒక వ్య‌క్తి అఘోరాగా ఎందుకు మార‌తాడు అనే విష‌యాల‌ను ఈ సినిమాలో చూపించాడ‌ట బోయ‌పాటి. మొత్తానికి థియేట‌ర్స్ ముందు ఫ్యాన్స్ హంగామా మీరు చూసేయండి..

అఖండ సినిమా బెనిఫిట్ షో కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ లో ప్రదర్శించారు. అర్ధరాత్రి నుంచే అభిమానులు హంగామా చేస్తున్నారు. జై బాలయ్య, సీఎం బాలయ్య అంటూ భారీగా నినాదాలు చేస్తున్నారు.

https://twitter.com/dinakarvsp/status/1466229950801793024?s=20 https://twitter.com/pandu_kdp/status/1466211688038862851?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1466211688038862851%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fakhanda-first-review-nandamuri-balakrishna-boyapati-srinu-gets-hatric-hit-588450.html  

ట్రెండింగ్ వార్తలు