Game Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా?

December 23, 2023

Game Changer: గేమ్ చేంజర్ విడుదల.. దిల్ రాజు వల్ల అవుతుందా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు బోలెడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా దిల్ రాజు ఇప్పటివరకు నిర్మించిన సినిమాలలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి కావాల్సి ఉండగా దర్శకుడు శంకర్ వేరే సినిమా షూటింగ్లలో బిజీబిజీగా ఉండడంతో ఈ సినిమా గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తూనే ఉంది. మరోవైపు చెర్రీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా(Game Changer) విడుదల తేదీ ఇంకా ఆలస్యం అయ్యేలానే కనిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమా గురించి చేసిన ఒక కామెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. చుట్టూ భారీ బందో మస్తు మధ్యలో మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పరుగు పరుగున వెళుతున్నారు దిల్ రాజు. అందులో భాగంగానే గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని ఒక అతను ప్రశ్నించగా సెప్టెంబర్ అని చెప్పి అక్కడినుంచి వెంటనే వెళ్ళిపోయారు.

అయితే దిల్ రాజు చెప్పిన విధంగానే సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. దిల్ రాజు వల్ల అవుతుందా ఈ సినిమా పరిస్థితి చూస్తే వేరేలా ఉంది కానీ, దిల్ రాజు మాత్రం ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేస్తానని మాట ఇచ్చాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దిల్ రాజు అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అన్న తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి..

Read More:మంట పెట్టిన మాలవిక.. ఏం ఫిట్నెస్ రా బాబు 

ట్రెండింగ్ వార్తలు