కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు..ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ?

December 30, 2023

కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు..ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ?

Dil Raju Contesting as MP: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగాను ప్రొడ్యూసర్లుగాను కొనసాగినవారు రాజకీయాల లోకి వచ్చి ముఖ్య మంత్రులు గాను ఎంపీలు గాను మంత్రులుగాను పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది సీనియర్ నటీనటులు ఇప్పటికీ ఎంపీ లుగా కొనసాగుతూ రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిం చుకున్నారు. అయితే త్వరలోనే బడా ప్రొడ్యూసర్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా మారి దాదాపు 50 సినిమాలను నిర్మించి అగ్ర నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చిన్న సినిమాలను నిర్మిస్తూ నేడు వందల కోట్ల బడ్జెట్ సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతోమంచి సక్సెస్ అందుకున్నటువంటి దిల్ రాజు రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి.

ఇలా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన ఈ వార్తలపై స్పందించి ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని టైం వచ్చినప్పుడు నేను చెబుతాను అంటూ వెల్లడించారు అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి మరికొన్ని నెలలలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయ డానికి సిద్ధమయ్యారని సమాచారం.

ఈయన తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా(Dil Raju Contesting as MP) పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి దిల్ రాజు రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Read Moreభలే కవర్ చేసిందే.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ వైరల్

ట్రెండింగ్ వార్తలు