నా పేరు తప్పుగా వాడుకుంటే తాటతీస్తా… మీడియాకు దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్?

January 8, 2024

నా పేరు తప్పుగా వాడుకుంటే తాటతీస్తా… మీడియాకు దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిర్మాత దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం నిర్మాతగా మారారు చిన్న సినిమాలను నిర్మిస్తూ నేడు పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి అయితే ఈ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివాదాలలో దిల్ రాజు పేరు తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే దిల్ రాజు గుంటూరు కారం సినిమా కోసం మరో చిన్న సినిమాని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఈయన గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రతి సంక్రాంతికి ఎన్నో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి అయితే ప్రతిసారి తనపై ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారని దిల్ రాజు తెలిపారు. చిరంజీవి తనపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయని ఫైర్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.

వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. హనుమాన్ సినిమాకు థియేటర్లో లేకుండా చేశాను అంటూ చాలా వెబ్సైట్స్ నా గురించి తప్పుడుగా వార్తలు రాస్తున్నారు. ఇకపై నా గురించి ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే అసలు ఊరుకోనని వారి తాట తీస్తాను అంటూ ఈయన మీడియాకు చాలా స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు.నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయని, నాగార్జున వెంకటేష్ సినిమాలకు థియేటర్లు లేవు అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.

Read Moreఓడియమ్మ ఇది కూడా కాపీయేనా?.. గుంటూరు కారం స్టోరీ ఇదేనట

ట్రెండింగ్ వార్తలు