‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్…ముఖ్య అతిధి ఎవ‌రో తెలుసా..?

November 24, 2021

‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్…ముఖ్య అతిధి ఎవ‌రో తెలుసా..?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం అఖండ మీద‌ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2న విడుద‌ల‌చేయ‌నున్న విష‌యం తెలిసిందే..ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో ఈ నెల 27న అతిర‌థ‌మ‌హాశ‌యుల స‌మ‌క్షంలో జ‌రుగ‌నుంద‌ట‌. ఈ ఈవెంట్‌కి జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ హాజ‌రుకానున్నారు. అలాగే ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చే అవకాశం ఉంది. త్వ‌ర‌లో వెంక‌టేష్‌, చిరంజీవి క‌లిసి ఆహా కోసం బాల‌కృష్ణ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే ప్రోగ్రాంకి రానున్నారు. ఈ ప్రోగ్రాంలో చిరంజీవి బాల‌కృష్ణ‌లు ఎన్నో తెలియ‌ని విష‌యాలు పంచుకున్న‌ట్లు తెలుస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు