ఒకే రోజు ఓటీటీలో మూడు సినిమాలు

January 9, 2022

ఒకే రోజు ఓటీటీలో మూడు సినిమాలు

ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్‌లో విడుదలై 40 రోజులు గడవక ముందే సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అర్జున ఫల్గుణ’ చిత్రం డిసెంబరు 31న విడుదలైంది. అయితే ఈ సినిమాను ఈ నెల 21న ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఇదే రోజున నాని శ్యామ్‌సింగరాయ్, బాలకృష్ణ అఖండ చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. జనవరి 21న శుక్రవారం. కానీ ఆ రోజు థియేటర్స్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కావడం లేదు. దీంతో సినిమాల స్ట్రీమింగ్‌కు జనవరి 21 అయితేనే బాగుంటుంది ఆయా స్ట్రీమింగ్‌ సంస్థలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Readmore ఎప్పుడొచ్చిన మా స్థాయి మారదు

ట్రెండింగ్ వార్తలు