ఆదివారం అంటే నాటుకోడి, బీర్లు ఉండాల్సిందేనా.. సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున?

March 27, 2024

ఆదివారం అంటే నాటుకోడి, బీర్లు ఉండాల్సిందేనా.. సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అక్కినేని నాగార్జున ఒకరు. ఇప్పటికే తన కొడుకులతో సమానంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని అందం ఫిట్ నెస్ తో నాగార్జున ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినటువంటి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాగార్జున ఆరు పదుల వయసులో ఉన్నప్పటికీ చాలా ఫిట్ గా ఉంటారు మీ సీక్రెట్ ఏంటి అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ సందర్భంగా నాగర్జున మాట్లాడుతూ తాను సోమవారం నుంచి శనివారం వరకు చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతానని తెలిపారు. ఏది తినాలి ఏది తినకూడదు ఎంత తినాలనే విషయాలు చాలా ఖచ్చితంగా ఫాలో అవుతానని ఈయన తెలిపారు.

ఇక ఆదివారం వచ్చింది అంటే ఈ డైట్ మొత్తం తీసి పక్కన పెట్టేస్తానని తెలిపారు. ఆదివారం తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంటుందని ఆరోజు మొత్తం ఫుల్లుగా నాకు నచ్చినది కడుపునిండా తిని విశ్రాంతి తీసుకుంటానని నాగార్జున తెలిపారు. ఇక ఆదివారం అంటే బీర్లు నాటుకోడి కంపల్సరిగా ఉండాలని నాగార్జున తెలిపారు. ఇలా ఒక ఆదివారం నాటుకోడి పులుసు తింటూ బీరు తాగుతూ ఉండగా నాకు శిరిడి సాయి సినిమా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చిందని తెలిపారు.

ఇప్పటివరకు శ్రీరామదాసు అన్నమయ్య వంట సినిమాలు చేశాను సాయిబాబా మీద ఎందుకు సినిమా చేయకూడదనే ఆలోచన నాకు ఆ క్షణం కలిగింది. వెంటనే రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి నా ఆలోచన తనతో పంచుకున్నాను ఈ ఆలోచన రాగానే నేను షిరిడి వెళ్లి మొదటిసారి స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత మనం ఈ సినిమా చేస్తున్నామని రాఘవేంద్ర రావు గారితో చెప్పానని అలా శిరిడి సాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటూ ఈ సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: కూతురి ఫేస్ రివీల్ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో?

ట్రెండింగ్ వార్తలు