కూతురి ఫేస్ రివీల్ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో?

March 27, 2024

కూతురి ఫేస్ రివీల్ చేసిన ఉపాసన.. ఎంత క్యూట్ గా ఉందో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత ఏడాది చిన్నారి జన్మించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకొని గత పదికొండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లైనటువంటి 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈ దంపతులకు గత ఏడాది జూన్ 20వ తేదీ ఆడబిడ్డ జన్మించింది.

ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం చేశారు అయితే పాప పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారిని ఎప్పుడెప్పుడు చూడాలా అనే అభిమానులందరూ కూడా చాలా ఆరాటం వ్యక్తం చేశారు అయితే చిన్నారి ఫేస్ కనపడకుండా ఉపాసన ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈమె కుమార్తె ఎలా ఉంటుందనే విషయాలను అభిమానులకు తెలియజేశారు.

నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఉపాసన రాంచరణ్ తో పాటు ఉపాసన తల్లిదండ్రులు కూడా తిరుమలకు వెళ్లారు. ఇలా తిరుమల వెళ్ళినటువంటి వీరు నేడు ఉదయం సుప్రభాత సేవలోనే స్వామి వారిని దర్శించుకున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకునే సమయంలో ఉపాసన కుమార్తె ఫేస్ కనపడకుండా దాచకుండా తన కూతురు ఫేస్ రివీల్ చేయడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా అమ్మ ఒడిలో క్లీన్ కారా క్యూట్ గా చూస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు చరణ్ అన్న పోలికలతోనే మెగా లిటిల్ ప్రిన్సెస్ ఉన్నారు అంటూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. అయితే త్వరలోనే అధికారికంగా క్లీన్ కారా ఫోటోలను ఉపాసన రివీల్ చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం వీడియోలు వైరల్ గా మారాయి.

Read More: నాని నటనకు ఫ్లాట్ అయిపోయి ఫాన్ అయిపోయిన బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్.. అందుకే అతనితో భేటీ!

ట్రెండింగ్ వార్తలు