ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో సినిమాకి కుబేర టైటిల్ ఫిక్స్.. ధనుష్ బికారి లా కనిపిస్తున్నాడే?

March 9, 2024

ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో సినిమాకి కుబేర టైటిల్ ఫిక్స్.. ధనుష్ బికారి లా కనిపిస్తున్నాడే?

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించినప్పటికీ సెట్స్ మీదకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం తీసుకుంది. గత నెలలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా ఇప్పటికీ పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.

అయితే శివరాత్రిని పురస్కరించుకొని చిత్ర బృందం ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది మూవీ టీం . ఇప్పటి వరకు ఈ సినిమా డి ఎన్ ఎస్ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కుబేర అని పేరు పెట్టినట్లు తెలియజేస్తూ సోషల్ మీడియా లో పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. ధనుష్ అందులో మాసిన దుస్తులు, గుబురు గడ్డంతో చూడటానికి బికారి లాగా కనిపిస్తున్నాడు. ధనుష్ వెనక శివుడు, అన్నపూర్ణాదేవి ఫోటో కనిపిస్తుంది.

సినిమా పేరు కుబేర, ధనుష్ చూస్తే బికారి లాగా కనిపించడంతో సినిమాపై అందరికీ ఆసక్తి కలుగుతుంది. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల సినిమాలు అంటే క్యూట్ లవ్ స్టోరీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ పోస్టర్ తో మొదటిసారి శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఏదో కొత్తగా విభిన్నంగా ప్రయత్నిస్తున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది.

మాఫియా నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన అప్డేట్స్ రావాలని ఉంది. ఇందులో రష్మిక మందన్న కథానాయకగా నటిస్తోంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సార్ సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు కుబేరగా ఎలా మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే. ఇది ధనుష్ కి 51వ సినిమా కావటం గమనార్హం.

Read More :  ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. కల్కిలో ప్రభాస్ పేరు రివీల్ చేసిన మూవీ టీమ్!

ట్రెండింగ్ వార్తలు