NTR 30: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌ సినిమాలో ఆలియా భ‌ట్ క‌న్ప‌ర్మ్ ఇదిగో ప్రూఫ్‌

February 3, 2022

NTR 30: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌ సినిమాలో ఆలియా భ‌ట్ క‌న్ప‌ర్మ్ ఇదిగో ప్రూఫ్‌

NTR-KORATALA SHIVA: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే..ఎన్టీఆర్‌కు కెరీర్ ప‌రంగా ఇది 30వ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ న‌టించ‌నుందనే వార్త గ‌త కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లుకొడుతోంది.

అయితే ఈ రోజు ముంబైలో జరిగిన ‘గంగూబాయి కథియావాడి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆలియా..ఎన్టీఆర్ సినిమా గురించి విలేఖ‌రులు ప్రశ్నించగా…ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించ‌డం నిజ‌మే..నేను కొరటాల శివ గారితో మాట్లాడుతున్నాను. ఆయన ఇప్పటి వరకూ చాలా మంచి సినిమాలు తీశారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 గురించి ఏమీ చెప్ప‌లేను కాని మా కాంబినేష‌న్ వర్క‌వుట్ అవుతుంద‌ని మాత్రం అనుకుంటున్నాను` అని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ కాకుండా తెలుగులో ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అని అడిగితే చిరంజీవి గారు, రామ్ చరణ్ కాంబినేష‌న్లో కొరటాల శివ గారు డైరెక్ట్ చేసిన ‘ఆచార్య’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని చెప్పారు.

ప్ర‌స్తుతం ఆలియా మాట‌ల్ని బ‌ట్టి చూస్తే దాదాపుగా ఎన్టీఆర్ 30లో హీరోయ‌న్‌గా క‌న్ఫ‌ర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో స్టూడెంట్‌ లీడ‌ర్‌గా, అలాగే బస్తీలో చదువుకునే పేద విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసే నాయకుడిగా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. స్థూలంగా చెప్పుకుంటే  ప్రభుత్వాన్ని ఓ విద్యార్థి నాయకుడు ఎలా ఢీ కొన్నాడు? అనేది ఎన్టీఆర్‌30 మాల‌క‌థ‌గా తెలుస్తోంది.

Read More: Bheemla Nayak: ప‌వ‌న్ భీమ్లా ట్రైల‌ర్ వ‌చ్చేది ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు