దేవర సెట్ నుంచి ఎన్టీఆర్ లుక్ రిలీజ్.. వైరల్ అవుతున్న న్యూ లుక్!

March 22, 2024

దేవర సెట్ నుంచి ఎన్టీఆర్ లుక్ రిలీజ్.. వైరల్ అవుతున్న న్యూ లుక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో తిరిగి దసరా పండుగకు వాయిదా వేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్ర బృందం గోవా షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కొద్దిరోజుల పాటు గోవాలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ షూటింగ్ లోకేషన్ నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ఫోటోలలో ఎన్టీఆర్ లుక్ అద్భుతంగా ఉండడంతో అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ, రాజు సుందరంలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్టిల్ లో ఉన్నారు. ఎన్టీఆర్ సింపుల్ గా, చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో NTR ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.

ఇక ఈ గోవా షెడ్యూల్లో భాగంగా ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడం కోసం గోవా వెళ్లారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More: బ్యాక్ మొత్తం చూపిస్తూ ఈ డ్రెస్సులో అలా ఉన్నాను అంటున్న సమంత?

ట్రెండింగ్ వార్తలు