మర్డర్‌ చేసిన ఆలియాభట్‌!

July 5, 2022

మర్డర్‌ చేసిన ఆలియాభట్‌!

ఆలియాభట్‌ నిర్మించిన తొలి హిందీ చిత్రం ‘డార్లింగ్స్‌’. షారుక్‌ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ మరో నిర్మాత. ‘డార్లింగ్స్‌’ సినిమాను నిర్మించడంతో పాటుగా ఈ చిత్రంలో ఆలియా కూడా నటించారు. జస్మీత్‌ కె రీన్‌ దర్శకత్వం వహిం చిన ఈ చిత్రంలో ఆలియాభట్‌తో పాటుగా షఫేలీ శర్మ, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ కీలక పాత్రధారులు. అయితే ‘డార్లింగ్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. వచ్చేది మాత్రం థియేటర్స్‌లో కాదు. ఓటీటీలో..

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో ఆగస్టు 5న ఆలియాభట్‌ ‘డార్లింగ్స్‌’ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఓ కప్ప, తేలు కథ చెబుతున్నట్లుగా సినిమా కథనాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఈ టీజర్‌ క్లైమాక్స్‌లో ‘మర్డర్‌ జరిగింది నిజంగా కాదు సార్‌..కలలో..నా ఊహాలో మర్డర్‌ జరిగింది’ అని ఆలియా చెప్పడం సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తోంది. మరోవైపు ఆలియాభట్‌ ఇటీవలే రణ్‌బీర్‌కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరద్దరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక రణ్‌బీర్, ఆలియాలు కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తొలిపార్టు ఈ సెప్టెంబరు 9న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ట్రెండింగ్ వార్తలు