Gangubai Kathiawadi: అజయ్ దేవగన్ స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్..రేపు ట్రైల‌ర్ రిలీజ్‌

February 3, 2022

Gangubai Kathiawadi: అజయ్ దేవగన్ స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్..రేపు ట్రైల‌ర్ రిలీజ్‌

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఇటీవ‌లే ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో అజయ్ దేవగణ్ పవర్ ఫుల్ లుక్‌లో సలాం పెడుతున్నట్టు క‌నిపిస్తున్నారు. 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు.

Read More: ప్రారంభ‌మైన మ‌హేష్-త్రివిక్రమ్ సినిమా…రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడంటే? 

ట్రెండింగ్ వార్తలు