ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న ఆ టాటూ అర్థం ఏంటో తెలుసా?

April 23, 2024

ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న ఆ టాటూ అర్థం ఏంటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు జాతి రత్నాలు బ్యూటీ పరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. అయితే జాతి రత్నాలు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని చాలామంది భావించారు.

కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇది తాజాగా ఈ హీరోయిన్ అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని హీరో నాని చేతులు మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో ఫరియా కాలు పై ఉన్న డిఫరెంట్ టాటూ గురించి ప్రశ్నించారు. చెట్టు ఏరుల రూపంతో ఆ టాటూ కనిపిస్తుంది. దాని అర్ధం ఏంటని ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ..

ఈ టాటూ రూట్స్ అండి. నేను పర్సనల్ గా నమ్మేది ఏంటంటే.. వేర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత ఎత్తుకి ఎదగగలం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ టాటూ వేయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఫరియా డిఫరెంట్ ఐడియా నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమా విషయానికి వస్తే.. పెళ్లి కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 3న రిలీజ్ కాబోతుంది.

Read More: హీరోయిన్లకు పూజ చేస్తే వేణు స్వామి డబ్బు తీసుకోరా.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు