మా అంజి గాడు ప్రాణం అంటున్న మిర్న మీనన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

January 5, 2024

మా అంజి గాడు ప్రాణం అంటున్న మిర్న మీనన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!

సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్లన్నీ ఎన్నో సినిమాలతో కలకలలాడుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ చిన్న హీరోల నుంచి మొదలుకొని పెద్ద హీరోల వరకు పెద్ద ఎత్తున సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి పండుగకి కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు నాగార్జున సైతం నా సామిరంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి విజయ్ బిన్నీ అనే కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోలైనటువంటి అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదివరకే వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేశారు.

ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా నటి ఆషికా రంగనాథ్ నటించగా అల్లరి నరేష్ కి జోడిగా మిర్న మీనన్ నటిస్తున్నారు. ఇటీవల ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. మా అంజిగాడి ప్రాణం అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ పోస్టును విడుదల చేశారు. ఇందులో ఈమె సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని చంకలో క్యారేజ్ పట్టుకొని జడలో పువ్వులు పెట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈమె ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అల్లరి నరేష్ అంజి గాడి పాత్రలో కనిపించబోతున్నారు అయితే నరేష్ తో ఈమె రెండోసారి జతకట్టబోతున్నారని తెలుస్తుంది. ఇదివరకు అల్లరి నరేష్ మిర్న మీనన్ కాంబినేషన్లో ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరోసారి వీరిద్దరూ నా సామిరంగ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read More: గదిలో ఒంటరిగా కూర్చుని బాగా ఏడ్చాను… మొదటిసారి భర్త గురించి చెప్పిన ఇలియానా!

ట్రెండింగ్ వార్తలు