అయాన్ ను అప్పుడే సిద్ధం చేస్తున్న బన్నీ.. మామూలు ప్లాన్ కాదుగా?

March 11, 2024

అయాన్ ను అప్పుడే సిద్ధం చేస్తున్న బన్నీ.. మామూలు ప్లాన్ కాదుగా?

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి సెలబ్రిటీలు వారి పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది నటనలో శిక్షణ తీసుకుంటూ ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అల్లు వారసుడు అయాన్ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఇప్పటివరకు తన కుమారుడు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉన్నారు కానీ ఇటీవల కాలంలో అయాన్ బన్నీకి మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చిలిపి పనులు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ మోడల్ అయాన్ అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అల్లు అయాన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఇటీవల కాలంలో ఈమె భారీ స్థాయిలో షేర్ చేస్తున్నారు ఇప్పటినుంచి అందరి ఫోకస్ తనపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో భాగంగా ట్రైనర్ తో కలిసి బాక్సింగ్ ఆడుతూ కనిపించారు. అదేవిధంగా తన తల్లితో కలిసి పెద్ద ఎత్తున టైర్లను లిఫ్ట్ చేస్తూ కనిపించారు. అలాగే ఒక జెంటిల్మెన్ ల న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నటువంటి ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వామ్మో అయాన్ ను ఇప్పటినుంచే హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారని తన ఎనర్జీ చూస్తుంటే హీరోగా సక్సెస్ అవ్వడం పక్క అంటూ మరికొందరు ఈ ఫోటోలు వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు.

Read More : ఆ ఒక్క ఫోటోతో విజయ్ దేవరకొండతో రిలేషన్ బయటపెట్టిన రష్మిక.. ఇంకేం ప్రూఫ్స్ కావాలి?

ట్రెండింగ్ వార్తలు