ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదు.. అల్లు అరవింద్‌పై బన్నీ కామెంట్స్

December 25, 2023

ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదు.. అల్లు అరవింద్‌పై బన్నీ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఒకరు అల్లు రామలింగయ్య వారి సరిగా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్(Allu Arjun) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇక ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి రావడాని కంటే ముందుగా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన నటించినటువంటి మొట్టమొదటి సినిమా విజేత చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా 1985లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత కావటం విశేషం. అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా గురించి తాజాగా అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్(Allu Arjun) తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజేత సినిమాకు సంబంధించినటువంటి షీల్డ్ అల్లు అరవింద్ పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి అల్లు అరవింద్ ఓ మై గాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో నటించినందుకు మా నాన్న నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ సరదాగా ఈ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: రామ్ చరణ్ పోస్ట్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి.. హర్ట్ అవుతున్న అభిమానులు

ట్రెండింగ్ వార్తలు