Payal Rajput Break Up Story: నా ల‌వ్ రిజెక్ట్ చేశాడు

November 9, 2023

Payal Rajput Break Up Story: నా ల‌వ్ రిజెక్ట్ చేశాడు

Payal Rajput Break Up Story: ఈ రోజుల్లో అబ్బాయిల‌కైనా, అమ్మాయిల‌కైనా లవ్ ఫెయిల్యూర్ అనేది స‌హ‌జం. దాని గురించి ఎక్కువ బాధ ప‌డ‌కుండా మూవ్ఆన్ అయ్యేవారి సంఖ్యే ఎక్కువ‌. అల్లు అర్జున్‌ (AlluArjun), రానా(Rana Daggubati) లాంటి హీరోలు ఇప్ప‌టికే త‌మ ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీల‌ను ఆన్ స్క్రీన్ చెప్పేశారు..అయితే ఇప్పుడు ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్ తెచ్చుకుని కొన్ని ల‌క్ష‌ల మంది యూత్‌కి ఫేవ‌రేట్‌గా మారిన ఓ హీరోయిన్‌ని కూడా అప్ప‌ట్లో రిజ‌క్ట్ చేశాడ‌ట ఒక అబ్బాయి..ఆ హీరోయిన్ ఎవ‌రు? ఏంటా స్టోరీ అనేది చ‌ద‌వండి.

ఆర్ఎక్స్‌ 100(RX 100) సినిమాతో.. కుర్రాళ్ల‌ గుండెల్లో సుస్థిర‌స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పూత్‌(Payal Rajput).. ఆ సినిమాతో యూత్‌లో క్రేజీ హీరోయిన్‌గా స్థిర‌ప‌డింది. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాఫులు వ‌చ్చినా అమ్మ‌డి స్టార్‌డ‌మ్ మాత్రం త‌గ్గ‌లేదు..అవ‌కాశాలు ఆగ‌లేదు. ఈ బ్యూటీ ఆర్ ఎక్స్‌ 100తో త‌న‌ని ప‌రిచ‌యం చేసిన అజ‌య్ భూప‌తి(AjayBhupathi) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న మంగ‌ళ‌వారం (Mangalavaaram) సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది. ట్రైల‌ర్ చూస్తే వీరిద్ద‌రూ ఈ సినిమాతో.. మరోసారి మిరాకిల్ చేసేలానే కనిపిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ మూవీ ప్రమోషన్స్‌ మొదలెట్టారు. హీరో, హీరోయిన్ల ఇష్టాయిష్టాలు, చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో లవ్‌ స్టోరీలు ఏవైనా ఉంటే చెప్పండి అంటూ అడుగుతుంటారు కూడా. అలా పాయల్‌ రాజ్‌పుత్‌ను తన ఫస్ట్‌ లవ్‌ గురించి అడిగారు. అప్పుడే ఆసక్తికర సమాధానం వచ్చింది. ఆ ప్రమోషన్స్‌లోనే తన సాడ్ అండ్ వన్‌ సైడ్ లవ్ స్టోరీ(Payal Rajput Break Up Story)గురించి చెప్పింది పాయల్..

చదువుకునే రోజుల్లోనైనా, సినిమా పరిశ్రమలోనైనా మీ క్రష్ ఎవరు ? అని ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడగ్గా.. స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించానని.. అతడిని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగేదని.. అందుకే తనను ప్రపోజ్ చేశానని కూడా ముసి ముసి నవ్వులతో చెప్పింది ఈ బ్యూటీ. కానీ ఆ తరువాతే అస‌లు విష‌యం చెప్పి అంద‌రికి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది… ‘అతడు నన్ను రిజెక్ట్ చేశాడంటూ.. చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ బాధతో చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్నని.. దాంతో పరీక్షల్లో ఫెయిలయ్యానని అప్పటి ఆ నాటి జ్ఙాపకాలను తన ఫ్యాన్స్‌ తో పంచుకుంది పాయల్.

Read MoreSamanthaRuthPrabhu: స‌మ‌స్య‌లు ఏక‌కాలంలో చుట్టుముట్టాయి

ట్రెండింగ్ వార్తలు