April 18, 2024
బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి అనసూయ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అనసూయ పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకొని అదే స్థాయిలో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈమె శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పోరాటం చేసే పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అనసూయ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఓ అభిమాని మీరు ఒంటరిగా ఒక ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా… అని అడిగాడు. ప్రశ్నకు సమాధానంగా అనసూయ… ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే నాకు పిచ్చ భయం. కానీ ఇప్పుడు ఆలోచిస్తా. ఎక్కడికి వెళితే బెటర్? ఒక సలహా ఇవ్వమని అనసూయ సదరు నెటిజెన్ ని అడిగింది. మరో నెటిజెన్ మీరు ఎక్కడకి వెళ్లినా అక్కడ పండగే అని కామెంట్ చేశాడు.
ఈ విధంగా నేటిజన్స్ కామెంట్ చేయడంతో అనసూయ సో స్వీట్ అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఈమె ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటున్నాను అంటూ కామెంట్ చేయడంతో కొంతమంది ఈ కామెంట్లను నెగిటివ్ వేలో ట్రోల్ చేస్తున్నారు అంటే భర్తను వదిలేసి మీరు ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఆమెను నెగిటివ్ గానే ట్రీట్ చేస్తూ ఉంటారు అయితే వీటన్నింటినీ ఒకప్పుడు పట్టించుకోని అనసూయ ప్రస్తుతం వీటిని ఏ మాత్రం లెక్క చేయడం లేదని చెప్పాలి.
Read More: ప్రభాస్ పెళ్లి పై హీరో విశాల్ కామెంట్స్… ఫస్ట్ కార్డు ఆయనకే అంటూ?