రవితేజకు ఆ హీరోయిన్ నటన అంటే అంత ఇష్టమా.. ఫిదా అయిపోయాడా?

March 19, 2024

రవితేజకు ఆ హీరోయిన్ నటన అంటే అంత ఇష్టమా.. ఫిదా అయిపోయాడా?

సినీ ఇండస్ట్రీలో ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. ఈయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గాను అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈయన హీరోగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇలా సినిమా అవకాశాలను అందుకున్నటువంటి రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇకపోతే నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవితేజకు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరితోనూ దాదాపు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే రవితేజ నటించినటువంటి త్రిష ,శ్రీయ, అనుష్క, ఇలియానా వంటి స్టార్ హీరోయిన్స్ లో మీకు ఏ హీరోయిన్ తో నటించడం అంటే ఇష్టం ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు రవితేజ ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తనకు అనుష్కతో సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అంతేకాకుండా ఈమె నటన చాలా అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా అనుష్క శెట్టి గురించి రవితేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లు విక్రమార్కుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బలాదూర్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఇది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

Read More: నిద్ర కోసం ఆరాటపడిన రోజులు ఉన్నాయి.. మృణాల్ కామెంట్స్ వైరల్

ట్రెండింగ్ వార్తలు