జూనియర్ ఎన్టీఆర్ పేరు అంటే బాలయ్యకు అంత కోపమా.. ఆ ఒక్కటే కారణమా?

May 4, 2024

జూనియర్ ఎన్టీఆర్ పేరు అంటే బాలయ్యకు అంత కోపమా.. ఆ ఒక్కటే కారణమా?

సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన నందమూరి తారక రామారావు వారసుడిగా ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాత కీర్తి ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతున్నారు. ఎన్టీఆర్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో గ్లోబల్ స్టార్ అని ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఇటీవల కాలంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ కి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని చెప్పాలి. ఎన్టీఆర్ హరికృష్ణ గారి రెండో భార్య కుమారుడు కావడంతో ఎవరు కూడా ఆయనని. నందమూరి వారసుడుగా అంగీకరించలేదు కానీ ఎన్టీఆర్ మాత్రం తన తాత పేరును పెట్టుకొని ఇండస్ట్రీలో అంచ లంచలుగా ఎదుగుతూ అసలు సిసలైన నందమూరి వారసుడు అనిపించుకున్నారు.

నిజానికి ఎన్టీఆర్ కి తన తండ్రి రామ్ అనే పేరు పెట్టారట అయితే ఒకసారి తన తండ్రి ఎన్టీఆర్ గారు హరికృష్ణని పిలిచి మూడో వాడు ఏం చేస్తున్నారు అని అడిగారట చదువుతున్నారండి అని చెప్పగా ఒకసారి నా దగ్గరకు తీసుకురా అని ఎన్టీఆర్ ని పిలిపించుకున్నారట. నీ పేరేంటి అని అడగగా తారక్ రామ్ అని పెట్టాను అంటూ హరికృష్ణ చెప్పగా ఆ పేరు వద్దు. ఇక్కపై నీ పేరు నందమూరి తారకరామారావు అంటూ స్వయంగా తన పేరును తన మనవడికి ఎన్టీఆర్ దానం చేశారు.

ఈ విషయాలన్నింటినీ హరికృష్ణ గతంలో స్వయంగా వెల్లడించారు. ఇలా తన తండ్రి పేరును హరికృష్ణ రెండో భార్య సంతానం అయినటువంటి ఎన్టీఆర్ కి రావడంతో ఎన్టీఆర్ పేరు అంటే బాలయ్యకు కోపమని కేవలం బాలయ్యకు మాత్రమే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా పడదని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలో తొక్కేయడం కోసం ఒకప్పుడు బాలకృష్ణ తారకరత్నను కూడా రంగంలోకి దింపారని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ పేరులో ఉన్నటువంటి పవర్ ఆయన నటన నైపుణ్యాలు తనని ఈ స్థాయికి తీసుకు.వచ్చాయని చెప్పాలి.

Read More: వెండితెరపై హిట్.. బుల్లితెరపై పరువు పోగొట్టుకున్న ప్రభాస్?

ట్రెండింగ్ వార్తలు