Ashika Ranganath: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న కన్న‌డ‌ భామ‌

December 20, 2023

Ashika Ranganath: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న కన్న‌డ‌ భామ‌

ఆషికా రంగనాథ్(Ashika Ranganath).. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌..ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. దాంతో రెండ‌వ చిత్రంతోనే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు కావ‌డం విశేషం. ప్రస్తుతం నాసామిరంగ లో నటిస్తుంది అషిక‌..ఇప్ప‌టికే రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సంద‌డి చేసింది ఈ క‌న్న‌డ భామ‌(Ashika Ranganath).

అక్కినేని నాగార్జున జోడిగా నా సామిరంగలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో వరలక్ష్మి పాత్రలో ఆషికా నటిస్తున్నట్లు ఇటీవలే టీజ‌ర్ రిలీజైంది. అందులో త‌న లుక్‌తో ఆకట్టుకుంది. నాగార్జున‌తో కెమిస్ట్రీ కూడా వ‌ర్క‌వుట్‌ కావ‌డంతో సినిమాపై మంచి హైప్ నెల‌కొంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆషికా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తుంది.

తాజాగా నేవీ బ్లూ కలర్ డ్రెస్‏లో కాటుక కళ్లతో చూపులతోనే కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ ఫోటోల‌ను మీరు ఓ లుక్కేయండి..

 
 
View this post on Instagram
 

A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Read More: Dunki Trailer: బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్.. అద్భుతంగా ఆకట్టుకున్న డ్రోన్ షో

ట్రెండింగ్ వార్తలు