అనుకున్న దానికంటే ముందుగానే వైరల్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 8 డీటెయిల్స్?

April 12, 2024

అనుకున్న దానికంటే ముందుగానే వైరల్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 8 డీటెయిల్స్?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతూ ఇప్పటికే ఎన్నో సీజన్స్ కి కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే తెలుగులో బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో త్వరలోనే బిగ్ బాస్ తెలుగు 8 తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే మొదట హిందీలో గ్రాండ్ సక్సెస్ కావడంతో రీజన్ లాంగ్వేజెస్ కి పాకింది. తెలుగులో 2017లో బిగ్ బాస్ షో ప్రారంభం కాగా ఎన్టీఆర్ మొదటి హోస్ట్ గా వ్యవహరించారు.

తర్వాత సీజన్ 2 కి హీరో నాని వ్యవహరించారు. సీజన్ 3 నుండి నాని తప్పుకోవడంతో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ప్రతి సీజన్ కి ఆయనే హోస్ట్ గా కొనసాగుతున్నారు. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 7 ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. భారీ టీఆర్పీ రాబట్టింది. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో మేకర్స్ సీజన్ 7 సరికొత్తగా రూపొందించారు. గేమ్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీలు భిన్నంగా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఒక సామాన్యుడు కావడం విశేషం. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ కి ఝలక్ ఇస్తూ టైటిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ సీజన్ 8 త్వరగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నారట.

బిగ్ బాస్ సీజన్ 8కి ఏర్పాట్లు మొదలయ్యాయి అనేది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం స్టార్ మాలో నీతోనే డాన్స్ అనే ఒక డాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుంది. ఇది జూన్ నెలలో ముగియనుందట. కాబట్టి జూన్ నాటికి షో మొదలయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యిందట. కొందరు సెలెబ్స్ ని సంప్రదిస్తున్నారట. అలాగే గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు అనుభూతి పంచేలా రూపొందిస్తున్నారట. సీజన్ 7 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 ఊహించిన దానికంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానుందట. మరోసారి నాగార్జున హోస్ట్ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఇది బిగ్ బాస్ ప్రియులు సంతోషించే విషయమే. మొత్తంగా స్టార్ మా సీజన్ 8 తో మరో సంచలనానికి సిద్ధం కానుంది. మరోవైపు ఈ షో మీద తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. మరి ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంత వ్యతిరేకత ఎదురైన షోని మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

https://telugu.chitraseema.org/yash-is-produce-the-magnum-opus-ramayana/

ట్రెండింగ్ వార్తలు