జ‌న‌వ‌రి బాక్సాఫీస్ రౌండ‌ప్‌…సంక్రాంతి విన్న‌ర్‌ ఎవ‌రంటే?

January 31, 2024

జ‌న‌వ‌రి బాక్సాఫీస్ రౌండ‌ప్‌…సంక్రాంతి విన్న‌ర్‌ ఎవ‌రంటే?

జనవరి…సినిమా ప్రేక్ష‌కులకి బాగా ఇష్ట‌మైన నెల‌..ఈ నెల‌లోనే సంక్రాంతి ఉండ‌డంతో త‌మ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు థియేట‌ర్ల‌ వ‌ద్ద‌కు ప‌రుగుల తీస్తారు అభిమానులు. దాంతో బాక్సాఫీసు ఒక్క‌సారిగా ఊపిరితీసుకుంటుంది. ప్ర‌తి ఏడాది సినిమాల్ని సంక్రాంతికి ముందు, సంక్రాంతి తర్వాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సంక్రాంతికి కూడా ముగ్గురు పెద్ద హీరోలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా కొత్త సూప‌ర్ హీరో పోటీలో గెలిచి ఫుల్ జోష్ మీద‌న్నాడు.

మొద‌టి వారం చెప్పుకోద‌గ్గ సినిమాల్లో సర్కారునౌకరి ఒక‌టి…సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వచ్చిన ఈ సినిమా కంటెంట్ ప‌రంగా ప‌ర్వాలేన‌ప్ప‌టికీ రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడం మైనస్ అయింది. దాంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌తో పాటు చిత్ర యూనిట్‌కి నిరాశ‌ను మిగిల్చింది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఉండ‌డంతో మ‌రో రెండు మూడు చిన్న సినిమాలు వ‌చ్చాయి..వెళ్లాయి.

అనేక వివాదాల త‌ర్వాత గుంటూరుకారం, హనుమాన్ సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ఈ రెండు సినిమాలు సందడి చేశాయి. వీటిలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాపై భారీ అంచనాలుండేవి. కానీ ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. అత్తారింటికీ దారేది సినిమా క‌థనే అటు ఇటు మార్చి తీశాడు అని హీరో ఫ్యాన్స్ నుంచి పెదవి విరుపులు వచ్చాయి. అదే టైమ్ లో హనుమాన్ సినిమాకు పాజిటివ్‌ టాక్ బయటకొచ్చింది.

ఇలా ఓ పెద్ద సినిమాకు నెగెటివ్ టాక్, చిన్న సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అక్క‌డే మ‌హేష్ మేనియా ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టింది.. అలా నెగ‌టివ్ టాక్ తోనే సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. ఆ స‌మ‌యంలోనే అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వం ఉండ‌డంతో హ‌నుమాన్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఇక‌. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ సినిమా మొద‌టినుండి ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ గ్రాస్ చేయ‌లేక‌పోయింది. దాంతో ఈ సినిమా మొద‌టి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నుంచి అతడి ఫ్యాన్స్ ఆశించిన కంటెంట్ సైంధవ్ లో లేకపోవడం ఒక ఎత్తయితే..మితిమీరిన హింస ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసింది.

ఇక సంక్రాంతి సినిమాల వరసలో చివర్లో వచ్చిన మూవీ నా సామిరంగ. కేవలం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని రికార్డ్ టైమ్ లో సినిమాను పూర్తిచేసి, రిలీజ్ చేశారు. కట్టుదిట్టమైన బడ్జెట్ లో సినిమాను తీసి, పకడ్బందీగా రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించింది.

సంక్రాంతికి షెడ్యూల్ అయి, భారీ పోటీ మధ్య వాయిదాపడిన కెప్టెన్ మిల్లర్ సినిమా రిపబ్లిక్ డేకు రిలీజైంది. మంచి వీకెండ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ధనుష్ నటించిన ఈ సినిమా తెలుగులో ఫ్లాప్. ఈ మూవీతో పాటు హన్సిక నటించిన 105 సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరో 3 సినిమాలది కూడా ఇదే దారి. ఓవరాల్ గా జనవరి నెలలో హనుమాన్ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Read More: ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న ప్రభాస్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

ట్రెండింగ్ వార్తలు