రేటు పెంచేసిన బాలయ్య

January 9, 2022

రేటు పెంచేసిన బాలయ్య
AKHANDA BALAKRISHNAహీరో బాలకృష్ణ కెరీర్‌లో ‘అఖండ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింహా, లెజెండ్‌’ చిత్రాల తర్వాత హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకు ప్రేక్షకులకు బ్రహ్మారధం పట్టారు. దీంతో ‘అఖండ’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్లి బాలయ్య కెరీర్‌లోనే ఓ మంచి హిట్‌ మూవీగా నిలి చింది. ఇక అఖండ సక్సెస్‌ బాలకృష్ణకు మంచి ఊపు నిచ్చింది. దీంతో తన పారితోషికాన్ని అమాంతం పేంచే శారు బాలకృష్ణ. ఇంతుకుముందు బాలకృష్ణ పారితోషికంగా పది కోట్ల లోపే ఉండేది. కానీ అఖండ చిత్రం తర్వాత బాలయ్య తన పారితోషికాన్ని 15 కోట్లకు పెంచారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ‘క్రాక్‌’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీమూవీమేకర్స్‌ బాలయ్యకు 15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఇక ఈ సినిమాయే కాకుండా..అనిల్‌రావిపూడితో బాలకృష్ణ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. అలాగే ఆహా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో బాలయ్య చేస్తున్న రియాలిటీ షో ‘అన్‌స్టాపబుల్‌’కు మంచి క్రేజ్‌ వస్తోంది. మరోవైపు అఖండ సినిమా ఈ నెల 21 నుంచి హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న విషయం విదితమే.

ట్రెండింగ్ వార్తలు