November 9, 2023
Tiger Nageswara Rao OTT: గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న మాస్ మహా రాజా రవితేజ(RaviTeja)..రీసెంట్‌గా తన రూట్ మార్చి మరీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao) సినిమా చేశారు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తనను తాను.. చాలా కొత్తగా పొట్రే చేసుకున్నాడు.. ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు రవితేజ కానీ ఫలితం ఎక్కడో తేడా కొట్టింది. పూర్తిగా మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై పెదవివిరిసారు. ముఖ్యంగా రవితేజ లుక్స్ విషయంలో చాలా రకాల వాదనలు వినపడ్డాయి. అటు ప్రేక్షకులు ఇటు విమర్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో ఈ సారి దసరా భరిలో భగవంత్(BhagavanthKesari) కేసరిగా వచ్చిన బాలకృష్ణ (Balakrishna) ముందు తేలిపోయాడు రవితేజ. అయితే ఎప్పటిలాగే సినిమా చేయడం వరకే నా పని.. ఫలితం ప్రేక్షకుల నిర్ణయం అని లైట్ తీసుకున్నాడు రవితేజ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్(Tiger Nageswara Rao OTT Streaming) న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా రైట్స్‌ను.. భారీ రేట్‌కు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఈ మూవీని నవంబర్ 24న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోందట. అయితే అఫీషియల్ గా ఈ న్యూస్ అటు ఓటీటీ సంస్థ కానీ.. ఇటు ప్రైమ్ టీం కాని అనౌన్స్ చేయనప్పటికీ.. ఈ సినిమా స్ట్రీమింగ్ నవంబర్ 24నుంచే అని.. ఇండస్ట్రీలో కాస్త గట్టిగా వినిపిస్తోంది. ఇదే న్యూస్ అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ.. మాస్ రాజా ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. మరి చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో..
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తునే ఉండండి చిత్రసీమ వెబ్‌సైట్ www.chitraseema.orgRead More: SamanthaRuthPrabhu: సమస్యలు ఏకకాలంలో చుట్టుముట్టాయి