తెలుగు బుల్లితెర ప్రేక్షకుల బిగ్‌బాస్ షో ఓ పసందైన వినోదం. ఇప్పటికే ఐదు సీజన్లు బిగ్‌బాస్ షో
తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసింది. లేటెస్ట్‌గా ఆరోసారి కూడా రెడీ అయ్యింది. మూడు, నాలుగు,
ఐదు సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునయే ఆరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
అయితే ఈ సారి మా టీవీలోనే కాదు..ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హార్ట్‌లో కూడా ఒకేసారి బిగ్‌బాస్ షో ప్రసారం కానుంది. డిస్నీ హార్ట్ స్టార్ ప్లస్ ఓటీటీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఈ బిగ్‌బాస్ సీజన్ తో ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మరింత మైలేజ్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే బిగ్‌బాస్ తెలుగుఆరో సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయం కూడా సోషల్‌మీడియా, ఇండస్ట్రీలో బాగానే చర్చ
జరుగుతుంది. బిగ్‌బాస్ 5 షోలోని కంటెస్టెంట్స్‌పై అప్పట్లో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరి..ఈ సారి ఈ విషయంలో నిర్వాహకులు ఎంతమేరకు జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయంపై
స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి..