హ్యాపీ బ‌ర్త్‌డే టు యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య…

November 23, 2021

హ్యాపీ బ‌ర్త్‌డే టు యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య…

తెలుగు సినీ పరిశ్రమ నట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు…ఆయన కుటుంబం నుండి వచ్చిన నట వారసుడు అక్కినేని నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడిగా వైవిధ్యమైన కథా చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు నాగార్జున. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న అక్కినేని కుటుంబం నుండి మూడోతరం వారసుడిగా వచ్చిన హీరో అక్కినేని నాగచైతన్య.

యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మిలకు ముప్ఫై ఆరేళ్ల కిందట హైదరాబాద్‌లో జన్మించాడు. అటు అక్కినేని కుటుంబం.. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ.. ఘనమైన వారసత్వం. కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తల్లి లక్ష్మి దగ్గరే ఎక్కువగా చెన్నైలో పెరిగాడు. అక్కడే స్కూలింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ తిరిగొచ్చాడు. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ పూర్తి చేశాడు. టీనేజీలో దాదాపు 100కిలోల బ‌రువు ఉండేవాడు. అందుకే అంతా ‘డంబూ’ అని పిలిచేవారు.

అక్కినేని వార‌స‌త్వం కావ‌డం నాన్న నాగార్జున‌తో క‌లిసి షూటింగ్స్‌కి వెళ్తుండడంతో స‌హ‌జంగానే సినిమాల‌పై ఆసక్తి క్రియేట్ అయ్యింది. దాంతో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి దాదాపు 25కిలోల‌ బరువు తగ్గాడు. నెలన్నరపాటు ముంబయిలోని ఒక వర్క్‌షాప్‌లో…అక్కడి నుంచి కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో ఏడాదిన్నర శిక్షణ తీసుకున్నాడు.

2009లో ‘జోష్‌’ సినిమాతో నాగచైతన్య తెరంగేట్రం చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవడానికి డిఫరెంట్‌ చిత్రాల్లో నటిస్తూ యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం పాతిక సినిమాలు చేశాడు. దడ, బెజవాడ చిత్రాలతో నాగచైతన్య యూత్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తఢాఖా చిత్రంతో ఇటు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఏ మాయ చేశావే, 100 పర్సెంట్‌ లవ్‌, ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుకచూద్దాం, మజిలీ, లవ్‌స్టోరీలు బాక్సాఫీసు దగ్గర విజయం సాధించాయి. ఫిల్మ్‌ఫేర్‌, సైమా, సినీమా, సంతోషం.. ఇలా పలు అవార్డులు అందుకున్నాడు.

తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి అక్కినేని నాగార్జునతో చైతన్య కలిసి నటించిన మనంతో భారీ హిట్‌ను సాధించారు. మూడు తరాల కలిసి నటించిన రెండో ఇండియన్‌ సినిమాగా.. తొలి దక్షిణాది సినిమాగా మనం సినిమా క్రెడిట్‌ను సంపాదించుకుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపించినా తను సూపర్‌ బైక్‌లు, హై-స్పీడ్‌ కార్లను అవలీలగా నడిపేయగలడు. నిజానికి ముందు రేసర్‌ కావాలనుకున్నాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఫెరారీ, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్‌రోవర్‌ వోగ్‌లాంటి అత్యంత వేగవంతమైన కార్లు తన గ్యారేజీలో ఉన్నాయి. వీటితోపాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి కాస్ట్‌లీ బైక్‌లూ కొలువుదీరాయి. అప్పుడప్పుడూ వీటిపై కూడా హైదరాబాద్‌ రోడ్లపై జామ్మంటూ దూసుకెళ్తుంటాడు.

రీసెంట్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీతో క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా యాక్టింగ్ మ‌రియు డ్యాన్స్‌తో కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ప్రస్తుతం కింగ్‌ నాగార్జునతో కలిసి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘బంగార్రాజు’లో నటిస్తున్నారు చైతన్య. నిన్న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ బాగుంది. అలాగే పుట్టిన‌రోజు కానుక‌గా ఈ రోజు(న‌వంబ‌రు 23) టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో న‌వమ‌న్మథుడిగా నాగ‌చైత‌న్య క‌నిపించాడుఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తండ్రీకొడుకులు ప్రేక్షకులను అలరించడం ఖాయమని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు