ధనుష్, శేఖర్ కమ్ముల #D51 లో జాయిన్ అయిన నాగార్జున

August 29, 2023

ధనుష్, శేఖర్ కమ్ముల #D51 లో జాయిన్ అయిన నాగార్జున
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ & నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవర్ ప్యాక్డ్ రోల్ లో కింగ్ నాగార్జున అక్కినేని జాయిన్ అయ్యారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి స్టార్ పెర్ఫార్మర్ కోసం వెతుకుతున్న మేకర్స్ “తన చరిష్మాతో తెరపై వెలుగులు నింపడానికి మన  ‘కింగ్ ‘ కంటే ఎవరు బెటర్ ” అని భావించారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ రోజు అనౌన్స్ మెంట్ చేశారు . ధనుష్ & నాగార్జున అభిమానులు వారి స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్  ప్రైవేట్ లిమిటెడ్ కలసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ధనుష్

ట్రెండింగ్ వార్తలు