కల్కి కోసం భారీగా డిమాండ్ చేసిన దీపిక.. మరో సినిమా తీయొచ్చు?

February 12, 2024

కల్కి కోసం భారీగా డిమాండ్ చేసిన దీపిక.. మరో సినిమా తీయొచ్చు?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం కల్కి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏకంగా 600 కోట్ల బడ్జెట్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో పలువురు స్టార్ సెలబ్రిటీలు నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటి దీపిక పదుకొనె నటిస్తున్నట్టు మనకు తెలిసిందే. దీపికాతో పాటు ఈ సినిమాలో నటి దిశ పఠాని కూడా నటించబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమా కోసం ఈమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం దీపికా ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

ఇలా 20 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈమె తీసుకున్న ఈ రెమ్యూనరేషన్ తో ఒక చిన్న హీరోతో ఒక సినిమా చేయొచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, రానా, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో రాధ పాత్రలో నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Read More: పెళ్లి పనులలో బిజీగా రకుల్…కారు పక్కన పెట్టి ఆటోలో రైట్ రైట్!

ట్రెండింగ్ వార్తలు