December 4, 2021
తాను బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చే ప్రైజ్ మనీలో సగం తన ప్రియురాలు దీప్తి సునయినకి ఇస్తాను అని చెప్పాడు షణ్ముక్. అంటే వారిద్దరు ప్రేమ వ్యవహారం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అలాగే మొన్న దీప్తి సునయిన బిగ్‌బాస్ షోకి వచ్చినప్పుడు కూడా బయట నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి బాగానే ఆడతాలే..అని దీప్తితో షన్ను చెప్పాడు. ఇంతగా తనను నమ్మి ఆడుతున్న షణ్ముక్‌ని కాదని మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ను దీప్తి సపోర్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది…
బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగుతో పాటు తమిళంలో కూడా నడుస్తోంది. అయితే ఇంత వరకూ షణ్ముఖ్‌ను గెలిపించాలని కోరుతూ వచ్చిన దీప్తి సునయన…తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వరుణ్‌కు మద్దతు ప్రకటించి అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని సోషల్ మీడియాలోషేర్ చేసింది.
ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్‌గా శ్రీరామ్ చంద్ర సెలక్ట్ అయ్యాడు. దాంతో షన్ను రెండో స్థానంలోకి వచ్చాడు. మరో ప్లేయర్ సన్నీ కూడా వారిద్దరికీ గట్టి పోటినే ఇస్తున్నాడు. మిగతా వారి గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు..వారు టాప్ 5లో ఉన్నా గెలిచేఅవకాశం ఎలాగు లేదు..ప్రస్తుతం తమ స్నేహితులను విజేతలుగా చూసేందుకు శ్రీరామ్, షణ్ముక్, సన్ని ఫ్రెండ్స్ శక్తి వంచన లేకుండా బయట శ్రమిస్తున్నారు. వారికి ఓటెయ్యమని అభ్యర్దిస్తున్నారు. ఇలాంటి సందర్బంలో షన్నుని సపోర్ట్ చేయాల్సిన దీప్తి వరుణ్‌కి సపోర్ట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఇప్పటివరకు దీప్తి, షన్నుకి కలసి సపోర్ట్ చేసిన వారు దీప్తిని అరె ఏంట్రా ఇది… అని షన్ను డైలాగ్‌తో ట్రోల్ చేస్తున్నారు.