November 27, 2021
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్ చివరిదశకు చేరుకుంది. 19 మంది ఇంటి సభ్యులతో మొదలైన షోలో ప్రస్తుతం 8మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. బిగ్‌బాస్(Bigg boss telugu 5) హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చి ఈ వారం సందడి చేశారు. శనివారం నాగార్జున వేదికపైకి వచ్చి తన షో స్టార్ట్ చేశారు. హౌస్‌మేట్స్‌కు సంబంధించిన మరికొందరు కుటుంబ సభ్యులు,స్నేహితులను వేదికపైకి తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే గత వారం కెప్టెన్ మానస్ మినహా మిగతా ఇంటి సభ్యులు షణ్ముఖ్, రవి, సన్నీ, శ్రీరామ చంద్ర, సిరి, కాజల్, ప్రియాంక లు నామినేషన్లో ఉన్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు? అనే ప్రశ్న చాలా మందికి అంతు చిక్కడం లేదు. అయితే ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. హౌస్‌లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్లతో పోలిస్తే రవి మంచి ప్రదర్శననే కనబరిచాడు. అయితే మిగతా వారిని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాడు అనేది రవికి నెగటివ్‌గా మారింది. అలాగే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూడడం కూడా రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడానికి కారణమైంది.