ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయిన తారక్.. ఫైర్ అవడం వెనుక కారణం అదేనా?

April 27, 2024

ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయిన తారక్.. ఫైర్ అవడం వెనుక కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన చాలా వరకు ఒకరిపై ఆగ్రహం వ్యక్తం చేయరు. అయితే ఎన్టీఆర్ ఎవరిపై అయినా కోప్పడ్డారు అన్న సీరియస్ అయ్యారన్న దాని వెనుక పెద్ద కారణం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్లో ఇటీవల ఎన్టీఆర్ పాల్గొని మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు.

ఇలా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చినటువంటి ఈయన ఇటీవల రెండో షెడ్యూల్ కోసం ముంబై వెళ్లారు. ఇలా ముంబై వెళ్ళినటువంటి ఈయనను ఫోటోగ్రాఫర్లు చుట్టూ ముట్టి తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడుకుంటూ హోటల్ రూమ్ లోకి వెళుతున్నటువంటి సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు ఎన్టీఆర్ ఫోటోలను తీశారు అది గమనించినటువంటి ఎన్టీఆర్ ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్లపై ఓయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎప్పుడు ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేయని తారక్ ఇలా ఫోటోగ్రాఫర్లపై కోప్పడ్డారు అంటే కారణం లేకపోలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారట అయితే ఆయన లుక్ బయటకు రివీల్ కాకుండా ఉండడం కోసం ఆయన జాగ్రత్త పడుతున్నారు కానీ ఫోటోగ్రాఫర్లు పర్మిషన్ లేకుండా ఇలా ఫోటోలు తీయడంతో ఎన్టీఆర్ కోప్పడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి దేవర సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read More: ఆ డైరక్టర్ కారణంగా ప్రభాస్ ఎన్టీఆర్ మద్య మాటలు లేవా.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు