April 27, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సీతారామం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినటువంటి మృణాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె రిలేషన్షిప్ గురించి పిల్లల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ అలాగే జీవితం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం కానీ అలా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని ఈమె తెలిపారు. ముఖ్యంగా రిలేషన్ షిప్స్ లో ఉండటం కష్టమని తెలిపారు. మనల్ని అర్థం చేసుకొని జీవిత భాగస్వామి దొరకడం చాలా అవసరమని ఈమె తెలిపారు.
ఇక ఈమె మాటలను బట్టి చూస్తుంటే ప్రస్తుతానికి ఈమె ఎవరితోనో రిలేషన్ లో లేరని స్పష్టంగా అర్థం అవుతుంది అదేవిధంగా ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనకి కొత్తగా అనిపించిన సెలెబ్రెటీలకు ఇది కామన్ అని చెప్పాలి ప్రస్తుతం వీరు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటారు వయసు పైబడిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ టైంలో పిల్లలు కనడం మంచిది కాదని భావించి చాలామంది వారు యుక్త వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు.
ఇలా వారు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్ ద్వారా వారు పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలకు ఇది కామన్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సైతం ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ కామెంట్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈమె వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడప్పుడే పెళ్లి పిల్లలు అనే ఆలోచనలో లేరని ప్రస్తుతం ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందని తెలుస్తోంది.
Read More: ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయిన తారక్.. ఫైర్ అవడం వెనుక కారణం అదేనా?