ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు.. వారిద్దరి నా స్నేహితులు.. రాజమౌళి కామెంట్స్ వైరల్!

May 2, 2024

ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు.. వారిద్దరి నా స్నేహితులు.. రాజమౌళి కామెంట్స్ వైరల్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినీ కెరియర్ ఎన్టీఆర్ తోనే ప్రారంభమైనదని చెప్పాలి. బుల్లితెర సీరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఇది రాజమౌళికి మొదటి సినిమా. ఈ సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు అనంతరం ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో రాజమౌళికి ఎంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, RRR వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో రాజమౌళి గురించి అలాగే ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ వారంతా కూడా తనని తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్నారంటూ పలు సందర్భాలలో వెల్లడించారు. ఈ విధంగా ఎన్టీఆర్ రాజమౌళి మధ్య వివరించలేనటువంటి అనుబంధం ఉందని చెప్పాలి. అయితే తాజాగా రాజమౌళి కృష్ణమ్మ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ ఇండస్ట్రీలో మీకున్నటువంటి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పాలి అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు అభిమానులందరూ ఎన్టీఆర్ అంటూ గట్టిగా కేకలు వేశారు కానీ ఎన్టీఆర్ తనకు ఫ్రెండ్ కాదని బాహుబలి నిర్మాతలు అయినటువంటి శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి తనకు మంచి స్నేహితులని చెప్పారు. ఇక ఎన్టీఆర్ నాకు ఫ్రెండ్ కాదని ఆయన నాకు తమ్ముడితో సమానం అంటూ రాజమౌళి చెప్పడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనని ఒక కుటుంబ సభ్యుడిగా భావించినందుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read More: సాయి పల్లవి అందం కోసం వాటికి సర్జరీ చేయించుకుందాం.. నటి రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్ వార్తలు