టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని ఫేవరెట్ హీరోలు వీళ్లేనా.. ఎందుకంత స్పెషల్?

April 8, 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని ఫేవరెట్ హీరోలు వీళ్లేనా.. ఎందుకంత స్పెషల్?

సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నాని కూడా ఒకరు. ఈయన నటనపై ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా పలువురు స్టార్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి నాని అనంతరం అష్టా చమ్మ సినిమా ద్వారా హీరోగా అవకాశాలను అందుకున్నారు. ఇలా పలు సినిమా అవకాశాలను అందుకున్నటువంటి ఈయన తన నటన నైపుణ్యాలను బయటపెడుతూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి నాని సినిమాలో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నాని ఇటీవల నటించిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. త్వరలోనే సరిపోలేదా శనివారం అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నానికి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నానికి ఇండస్ట్రీలో ఎంతోమంది ఫేవరెట్ హీరోలు ఉండగా ఇద్దరు మాత్రం చాలా ప్రత్యేకమని తెలియజేశారు. దానికి ఇండస్ట్రీలో బాగా ఇష్టమైనటువంటి హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు చెప్పాలి అనంతరం రవితేజ అంటే చాలా ఇష్టమట వీరిద్దరి తర్వాత తనంటే తనకు చాలా ఇష్టమని నాని వెల్లడించారు.

ఇలా చిరంజీవి రవితేజ అంటే ఎందుకంత ప్రత్యేకమైన విషయానికి వస్తే వీరిద్దరూ కూడా ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని వారిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చానని నాని తెలియజేశారు అందుకే ఇద్దరు హీరోలు అంటే తనకు చాలా ఇన్స్పిరేషన్ అంటూ నాని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: రాజమౌళితో సినిమాలు చేస్తే కెరియర్ కోల్పోయిన హీరోలు ఎవరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు