మొన్న పూరీ..నిన్న రానా..నేడు చార్మి…ఒకటే నిర్ణయం!

September 5, 2022

మొన్న పూరీ..నిన్న రానా..నేడు చార్మి…ఒకటే నిర్ణయం!

విజయ్‌దేవరకొండ ‘లైగర్‌’ సినిమా సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసు కున్నారు. అదే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం. ఎల్లప్పుడూ సోషల్‌మీడియాలో ట్వీట్స్, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లతో బిజీగా ఉండే పూరీ ఇలాంటి ఓ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో చాలామందికి షాకింగ్‌గా అనిపించింది. ‘లైగర్‌’ సినిమా కోసమే పూరీ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్‌’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మి నిర్మించారు. ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్న చార్మి ‘లైగర్‌’ ఫెయిల్యూర్‌ తర్వాత సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు. అలాగే నిర్మాతలుగా మళ్లీ పూరీ, నేను షైన్‌ అవుతామని తెలిపారు.

లైగ‌ర్ త‌ర్వాత పూరి, చార్మి విప‌రీత‌మైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. కొన్ని ఇంట‌ర్వ్యూల‌లో పూరి, చార్మి మాట్లాడిన మాట‌లే దానికి కార‌ణం. ఆ వీడియోలు చూపిస్తూ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దీంతో చేసేదేం లేక సోష‌ల్‌మీడియాకు దూర‌మైతున్న‌ట్లు ప్ర‌క‌టించారు చార్మి. అలాగే ఆచార్య ఫ్లాప్ త‌ర్వాత దర్శకుడు కొరటాల శివ కూడా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు బాలీవుడ్‌ దర్శకులు కూడా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు..

ట్రెండింగ్ వార్తలు