March 29, 2024
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా లెజెండ్. వారాహి చలనచిత్రం, 14 రీల్స్ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ అజంట, గోపి ఆచంట అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈనెల మార్చి 28 కి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండ్ బ్లాక్ బస్టర్ టెన్ ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు మూవీ యూనిట్.
అంతేకాకుండా ఈ సినిమాని మార్చి 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండుగ లాంటి అనుభూతిని ఇస్తుంది. నిర్మాతలకి శుభాకాంక్షలు చెప్తూ తోటి కళాకారులకు హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేశారు బాలకృష్ణ. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు, రికార్డులు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా నేనే చేయాలి. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్. ఈ సినిమా నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులని దాటిన ఈ సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్.
కళామతల్లి నా తల్లిదండ్రుల అభిమానుల ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుగుతున్నాను అని భావిస్తున్నాను. 2014 ఎలక్షన్స్ కి ముందు లెజెండ్ సినిమా విడుదలైంది. దాని ప్రభావం ఎన్నికల మీద ఎంతగా పడిందో మనకి తెలిసిందే. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, యాదృచ్ఛికంగా ఈ సినిమా మళ్లీ ఇప్పుడు విడుదల కాబోతుంది. సినిమా ప్రభావం రేపు జరగబోయే ఎన్నికలలో ఏమాత్రం ఉంటుందో చూడబోతున్నారు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.
ఇక బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా విశ్వవికేత నటసార్వమ తారక రామారావు గారికి అంకితం ఇస్తూ మొదలు పెట్టాము. ఆయన ఆశీస్సులతోనే ఇప్పుడు పది సంవత్సరాలు వేడుకలు కూడా చేసుకుంటున్నాము. ఈ సినిమాకి దర్శకుడుగా గర్వపడుతున్నానన్నారు. మార్చి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది, థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయమని చెప్పారు హీరోయిన్ సోనాల్ చౌహాన్.
Read More: ఒక్కరోజే పది చిత్రాల స్ట్రీమింగ్..ఓటీటీ లో వీకెండ్ జాతర!