నడుముకు బెల్టు.. ఊత కర్రలతో వీల్ చైర్ కి అంకితమైన హీరో.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

February 15, 2024

నడుముకు బెల్టు.. ఊత కర్రలతో వీల్ చైర్ కి అంకితమైన హీరో.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హృతిక్ రోషన్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇటీవల ఫైటర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి హృతిక్ రోషన్ వార్ 2 సినిమా పనులలో కూడా బిజీ అయ్యారు. అయితే ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఒక ఫోటో అందరినీ షాక్ కి గురి చేసింది.

హృతిక్ రోషన్ వీల్ చైర్ లో ఉండడమే కాకుండా నడుముకు బెల్ట్ వేసుకొని చేతిలో ఊత కర్రల సహాయంతో నిలబడి ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈయన షేర్ చేసిన ఈ ఫోటో కనుక చూస్తే ఈయన పెద్ద ప్రమాదానికి గురయ్యారని స్పష్టంగా అర్థం అవుతుంది. గతంలో మీలో ఎంత మందికి ఈ క్రచెస్‌, ఊత కర్రలు అవసరమొచ్చింది? ఆ సందర్భంలో మీ ఫీలింగ్‌ ఏంటి? అని తన అభిమానులను అడిగాడీ స్టార్ హీరో. ప్రస్తుతం తాను ఈ గాయం నుంచి కోలుకుంటున్నాను అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇలా తనకు ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేయకుండా ఒక్కసారిగా ఇలాంటి ఫోటోని షేర్ చేయడంతో సెలబ్రిటీలో సైతం ఏం జరిగింది అంటూ ఈయనకు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన తీరు చూస్తుంటే గత సినిమాలో పెద్ద ఎత్తున ప్రమాదానికి గురయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా హృతిక్ రోషన్ గాయాలు పాలైనటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఎన్టీఆర్ రాక కోసం తాను ఎదురుచూస్తున్నానని త్వరలోనే మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రారంభం కానున్నాయి అంటూ ఇటీవల ఈ హీరో వార్ 2 సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈయన ప్రమాదానికి గురికావడంతో ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రమాదం నుంచి నటుడు హృతిక్ రోషన్ తొందరగా కోలుకోవాలి అంటూ కూడా ప్రార్థిస్తున్నారు.

Read More: విశ్వంభరకి చిరు విరామం ఇచ్చిన మెగాస్టార్… ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు