వార్ 2 మూవీ నుంచి బిగ్ అప్డేట్.. త్వరలోనే వార్ టు షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్!

April 3, 2024

వార్ 2 మూవీ నుంచి బిగ్ అప్డేట్.. త్వరలోనే వార్ టు షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్!

ప్రస్తుతం దేవర షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక బాలీవుడ్ మూవీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ వార్ 2 కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు కీలక పాత్ర పోషిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు క్రేజి స్టార్లు కాంబినేషన్ లో సినిమా రాబోతుండటంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అయితే ఇన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ లో ఇప్పటివరకు ఎన్టీఆర్ జాయిన్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనటానికి ముందే ఎన్టీఆర్ ఫిట్నెస్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడంట. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడి దగ్గర తారక్ స్పెషల్ గా శిక్షణ తీసుకుంటున్నాడు.

అంటే వారు టూ లో ఫుల్ యాక్షన్ మోడ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ దిగబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రాబోతుంది. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాని 2025 ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉంటాయని బి టౌన్ లో టాక్.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో గూడచారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ వంద రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా కోసం సెట్ లో అడుగుపెట్టగా ఈనెల ద్వితీయార్థంలో ఎన్టీఆర్ కూడా సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. పది రోజులకు పైగా సాగే చిన్న షెడ్యూల్ గా ఉండనున్నట్లు తెలిసింది.

Read More: క్రేజీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ.. ఆ రోజే సినిమాకి ముహూర్తం!

ట్రెండింగ్ వార్తలు