వార్ 2 కోసం తారక్ రెమ్యూనరేషన్ తెలిసి షాక్ లో బాలీవుడ్?

March 13, 2024

వార్ 2 కోసం తారక్ రెమ్యూనరేషన్ తెలిసి షాక్ లో బాలీవుడ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒకటి ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక మరొక సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో ఈయన ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు.

ఈ విధంగా హృతిక్ రోషన్ సినిమా అంటేనే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. అలాంటిది ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో నటిస్తున్నారు అంటే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోయాయి అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో కనిపించిన రెమ్యూనరేషన్ మాత్రం భారీగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ లెన్త్ సినిమా చేస్తున్న హీరోలు కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వంటి హీరోలు మినహా ఎవరు కూడా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోలేదు. కానీ ఎన్టీఆర్ చిన్న గెస్ట్ పాత్రలో నటించడం కోసం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read More: Rajamouli: నేను పెద్దగా ఉత్సాహం చూపించలేదు!

ట్రెండింగ్ వార్తలు