విశ్వంభరకి చిరు విరామం ఇచ్చిన మెగాస్టార్… ఏమైందంటే?

February 15, 2024

విశ్వంభరకి చిరు విరామం ఇచ్చిన మెగాస్టార్… ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి ఇటీవల విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీ అయిన సంగతి మనకు తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ కనిపించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి మెగాస్టార్ అడుగుపెట్టినటువంటి కొద్ది రోజులకే చిన్న విరామం ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ కలిసి దాదాపు 18 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక త్రిష కూడా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా వరుస సినిమా షూటింగ్ హాజరవుతున్నటువంటి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈయన తన భార్య సురేఖతో కలిసి యూఎస్ఏ వెకేషన్ వెళ్లారు. ఇదే విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఫ్లైట్లో తన భార్య సురేఖతో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యతో కలిసి తాను యూఎస్ఏ వెకేషన్ వెళ్తున్నానని, త్వరలోనే విశ్వంభర షూటింగ్ తో మళ్ళీ కలుస్తా అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ కు ఎంతో మంది రిప్లై ఇస్తూ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు.. ఖుషి అవుతున్న పవన్ ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు