లెజెండ్ తర్వాత చేసిన సినిమాలన్నీ చెత్తవే… జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

April 2, 2024

లెజెండ్ తర్వాత చేసిన సినిమాలన్నీ చెత్తవే… జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జగపతిబాబు ఒకరు. ఈయన ఒకప్పుడు ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో హీరోగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈయన విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో ఈయన విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇతర భాషలలో కూడా విలన్ పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి కావడంతో చిత్ర బృందం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జగపతిబాబు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన లెజెండ్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలని తెలియజేశారు. లెజెండ్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని తెలిపారు. ఈ సినిమాకు ముందు నా చేతిలో ఒక సినిమా అవకాశం కూడా లేదు. ఎవరైనా ఒక అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్న సమయంలో లెజెండ్ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను నటిస్తానా లేదా అన్న సందేహంతోనే మేకర్స్ నన్ను సంప్రదించారని జగపతిబాబు తెలిపారు.

ఇక ఈ సినిమాకు నేను ఒప్పుకోవడమే కాకుండా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తర్వాత వందల సినిమాలలో నటించాను అయితే ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో క్యారెక్టర్ రాలేదని ఈ సినిమా సక్సెస్ తర్వాత నేను సరిగా ఈ సక్సెస్ యూస్ చేసుకోలేదని లేకపోతే నా కెరియర్ ఎంతో అద్భుతంగా ఉండేది అంటే ఈ సందర్భంగా జగపతిబాబు లెజెండ్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ప్రభాస్ కు ఎవరైనా నచ్చితే ఆ గిఫ్ట్ ఇస్తారా.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు