మోక్షజ్ఞ భారం మొత్తం బోయపాటి పైనే పెట్టిన బాలయ్య?

March 18, 2024

మోక్షజ్ఞ భారం మొత్తం బోయపాటి పైనే పెట్టిన బాలయ్య?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

ఇక మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ చెప్పేశారు. దీంతో అభిమానులు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈయనని ఏ డైరెక్టర్ ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతున్నారనే విషయం గురించి కూడా ఒక వార్త సంచలనంగా మారింది.

గతంలో మోక్షజ్ఞ అనిల్ రావిపూడి దర్శకత్వంలో లేదా బోయపాటి దర్శకత్వంలో రాబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా బోయపాటి డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

ఇక బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ ఒక యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం .ఇలా తన కొడుకు మోక్షజ్ఞ భారాన్ని మొత్తం బాలయ్య బోయపాటి చేతులలోనే పెట్టారని తెలుస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించబోతున్నట్టు సమాచారం.

Read More: స్క్రిప్టులు దొంగతనం చేస్తే గురూజీ అవుతారా.. మరోసారి కౌంటర్ ఇచ్చిన పూనమ్!

ట్రెండింగ్ వార్తలు