April 2, 2024
టాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ సాధించడంతో ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే కల్కి సినిమా ద్వారా కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎంతోమంది స్నేహితులు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. ఒక్కసారి ప్రభాస్ తో కనుక మాట్లాడితే ఆయనతో తప్పకుండా వాళ్ళు స్నేహం చేస్తారు అంత మంచి మనస్తత్వం ప్రభాస్ ది అంటూ ఇదివరకు ఎంతోమంది ప్రభాస్ మంచితనం గురించి పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇకపోతే తనతో ఫ్రెండ్షిప్ చేస్తే వారు ప్రభాస్ కి విపరీతంగా నచ్చేస్తే కనుక ఆయన వారికి ఒక గిఫ్ట్ పంపిస్తారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ తన మిత్రులకు తప్పనిసరిగా ఒక వాచ్ గిఫ్ట్ గా పంపిస్తారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఎంతోమంది హీరోలకు టెక్నీషియన్లకు అలాగే ఇతరులకు కూడా గిఫ్టులుగా చేతి వాచీలను పంపించారు. ఇలా బాగా నచ్చితే వారి స్నేహానికి గుర్తుగా వాచ్ ఇస్తారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించినటువంటి కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 9 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే ఎన్నికల సమయం దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రకటనలు వెలబడలేదు.
Read More: అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 9 ఉగాది సందర్భంగా అనౌన్స్ మెంట్!