ప్రతి సినిమాకు జాన్వీ కపూర్ అలాంటి కండిషన్ పెడుతుందా.. అప్పుడు తల్లి ఇప్పుడు కూతురు?

April 12, 2024

ప్రతి సినిమాకు జాన్వీ కపూర్ అలాంటి కండిషన్ పెడుతుందా.. అప్పుడు తల్లి ఇప్పుడు కూతురు?
జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె కెరియర్ పరంగా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం సక్సెస్ సినిమాలు లేనటువంటి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ అనే విషయానికి వస్తే కేవలం శ్రీదేవి వారసురాలు అనే ఒక కారణం మాత్రమే అని చెప్పాలి.ఇలా శ్రీదేవి బోనీ కపూర్ కుమార్తె కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట ఈమె ఎలాంటి సినిమాకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు ఒక కండిషన్ పెడతారట ఆ కండిషన్స్ కచ్చితంగా ఫాలో కావాల్సిందేనని తెలుస్తుంది.అయితే ఒకప్పుడు ఇలాంటి కండిషన్స్ తన తల్లి శ్రీదేవి డైరెక్టర్లకు పేట్టేవారట ఇప్పుడు తల్లి బాటలోనే జాన్వీ కపూర్ కూడా సినిమాలలో నటించాలి అంటే డైరెక్టర్లకు అదే కండిషన్ పెడుతున్నారని తెలుస్తుంది. రెమ్యూనరేషన్ విషయం అస్సలు పట్టించుకోని జాన్వి కపూర్ తన సినిమాలలో క్యారెక్టర్రైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండాలి అని.. ఎక్స్పోజింగ్ అయినా పర్వాలేదు కానీ తన పాత్రకు తగిన న్యాయం చేయగలిగే విధంగా తన పాత్ర ఉండాలని భావిస్తారట.ఏదో గ్లామరస్ పరంగా తెరపై కనిపించామా అన్న రోల్స్ మాత్రం తనకు ఇవ్వద్దు అంటూ ముందే చెప్పేస్తుందట . కథ చెప్పేటప్పుడు ఒకలాగా డైరెక్ట్ చేసేటప్పుడు మరొక లాగా చేయొద్దు అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చేస్తుందట. ఇలా రెమ్యూనరేషన్ తక్కువైనా పర్లేదు తన పాత్ర మాత్రం కచ్చితంగా ఉండాలని ఈమె కండిషన్లు పెట్టడంతో సినిమాల పట్ల ఈమెకు ఉన్న డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు.https://telugu.chitraseema.org/akhil-who-turned-into-arjun-reddy-look/ 

ట్రెండింగ్ వార్తలు