దేవర, మహేష్ సినిమాలపై అప్డేట్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఏమన్నారంటే?

May 2, 2024

దేవర, మహేష్ సినిమాలపై అప్డేట్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఏమన్నారంటే?

ఎన్ హీరో సత్యదేవ్ నటించినటువంటి కృష్ణమ్మ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ వివి గోపాల కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా కృష్ణమ్మ మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు కొరటాల శివ గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్స్ అందరూ కూడా హాజరై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ వారి సినిమాల గురించి అప్డేట్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా గురించి అలాగే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చేయబోయే సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వాలని కోరారు.

ఇలా అనిల్ రావిపూడి అడగడంతో దేవర సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ… త్వరలోనే దేవర సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాని అక్టోబర్ 10 వ తేదీ విడుదల చేస్తామని ఇప్పటికే తెలియజేసాం కదా అంటూ చెప్పుకు వచ్చారు. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా అప్డేట్ ఏదైనా ఇస్తారని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ రాజమౌళి మాట్లాడుతూ ఎవరైతే అనిల్ రావిపూడిని ముసుగు వేసి కొడతారో వారికి తాను పదివేలు ఇస్తానంటూ మాట్లాడారే తప్ప మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: హరిహర వీరు మల్లు దర్శకుడు మారారా.. టీజర్ తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

ట్రెండింగ్ వార్తలు