అమ్మని నమ్ముకుంటే మహేష్ కు లాభం లేదా.. తల్లి సెంటిమెంట్ కలిసి రాలేదా?

February 29, 2024

అమ్మని నమ్ముకుంటే మహేష్ కు లాభం లేదా.. తల్లి సెంటిమెంట్ కలిసి రాలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓ తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చిన్నప్పుడే రమ్యకృష్ణ తన తండ్రి మాటలను విని తన కొడుకును వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది.

తాను కొడుకుకు దూరమైన తన కొడుకుకు ఏ కష్టం రాకుండా ఈమె చూసుకుంటూ ఉంటారు. ఇలా తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సెంటిమెంట్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదని ఆడియన్స్ ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేకపోయారని తెలుస్తుంది. అయితే మహేష్ బాబు తల్లి సెంటిమెంటుతో గతంలో కూడా రెండు సినిమాలలో నటించారు. అయితే ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం గమనార్హం.

మహేష్ బాబు తేజ దర్శకత్వంలో నిజం అనే సినిమా చేశారు. ఇందులో తండ్రినీ చంపిన వాడి పట్ల పగ తీర్చుకోవడం కోసం తన తల్లి తనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇలా ఈ సినిమా తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ నటించిన చిత్రం నాని. ఎస్ జె సూర్య దర్శకత్వంలో చిన్న ఈ సినిమా కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇలా మహేష్ కు తల్లి సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ కాలేదని ఈ మూడు సినిమాలు పూర్తిగా నిరాశ పరిచయాన్ని తెలుస్తోంది.

Read More: ఎన్టీఆర్ తో మరోసారి నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన ప్రియమణి?

ట్రెండింగ్ వార్తలు