హనుమంతుడు వచ్చే సీన్ అయోధ్య గుడి నుంచి చేయాల్సి ఉండేదా?

February 2, 2024

హనుమంతుడు వచ్చే సీన్ అయోధ్య గుడి నుంచి చేయాల్సి ఉండేదా?

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించినటువంటి తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక చిన్న సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దాదాపు 300 కోట్ల చేరువలో ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో హనుమంతుడు ధ్యానం నుంచి వచ్చే సన్నివేశం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ ఎండింగ్ లో ధ్యానం నుంచి మేల్కొని హనుమంతుడు వచ్చే సీన్ కోసం.. ఆడియన్స్ రిపీటెడ్ గా థియేటర్స్ కి వస్తున్నారు ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి హనుమంతుడికి విభీషణుడి మాటలతో ఒక్కసారిగా ధ్యానం నుంచి బయటకు వస్తూ వాయువేగంతో వస్తుంటారు.

ఇలా ఈయన వచ్చేటప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి ముని పై ఆయన నీడ పడటంతో కళ్ళు తెరిచి చూస్తాడు. అయితే ఈ సన్నివేశం మరో విధంగా ప్రశాంత్ వర్మ రాసుకున్నాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. నిజానికి ఈ సన్నివేశం అయోధ్య రామ మందిరం నుంచి తీయాల్సి ఉండేదని తెలిపారు. ఓ చిన్నారి అయోధ్య రామ మందిరం ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటుంది.

ఆ దీపాలు గాలికి ఆరిపోతూ ఉంటాయి కానీ హనుమంతుడు ఆ ఆలయం మీద వెళుతున్నప్పుడు ఆ నీడకు దీపాలు వాటంత అవే వెలుగుతాయి. ఇలా ఈ సన్నివేశాన్ని తీసేలా నేను కథ రాసుకున్నానని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇలా ఈ సీన్ గురించి ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఇలాంటి సన్నివేశమే కనుక తీసి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది అంటూ సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు.

Read More: నా జీవితం నాశనం చేసింది వీడే.. కన్నీళ్లు పెట్టుకున్న బర్రెలక్క!

ట్రెండింగ్ వార్తలు