ఆ విషయంలో సమంత మహేష్ బాబు అల్లు అర్జున్ కంటే తోపా.. రికార్డు బద్దలు కొట్టిందిగా!

April 22, 2024

ఆ విషయంలో సమంత మహేష్ బాబు అల్లు అర్జున్ కంటే తోపా.. రికార్డు బద్దలు కొట్టిందిగా!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నెలకొల్పిన రికార్డులను మరో హీరో హీరోయిన్లు బ్రేక్ చేయడం అన్నది కామన్. అలా సెలబ్రిటీలు కేవలం సినిమాలతోనే కాదు పాటలతో కూడా రికార్డులు సృష్టించారు. స్టార్ సెలబ్రిటీల నుంచి ఒక పాట రిలీజ్ అయితే అది ఎన్ని వ్యూస్ తెచ్చింది, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని రోజులు ట్రేండింగ్ లో ఉంది. ఎంత ఫాస్ట్ గా అందరికి రీచ్ అయింది ఇలా ఎన్నో రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని రికార్డుల గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక పాటలు బాగుంటే వందల కోట్ల వ్యూస్ వస్తాయని తెలిసిందే.

ముఖ్యంగా అల్లు అర్జున్, సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసి పెట్టాయి. అలాగే ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన కుర్చీ మడతబెట్టి సాంగ్ తాజాగా రెండు వందల మిలియన్ వ్యూస్ సాధించింది. మహేష్, శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్ లో దద్దరిల్లాయో మనకు తెలిసిందే. యూట్యూబ్ లో కూడా ఆ పాట దాదాపు 20 కోట్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డుని సృష్టించింది. అయితే ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి.

వాటిల్లో ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డ్ ని బయటకు తీశారు. కుర్చీ మడతబెట్టి సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టింది. అయితే పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ అయితే కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్స్ వ్యూస్ సాధించింది.

అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ రావడానికి 95 రోజులు పట్టింది. ఇలా ఫాస్ట్ గా 200 మిలియన్స్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో సమంత ఊ అంటావా ఊ ఊ అంటావా మొదటి ప్లేస్ లో ఉంటే, మహేష్ కుర్చీ మడతబెట్టి సాంగ్ రెండో ప్లేస్ లో ఉంది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ మూడో ప్లేస్ లో ఉంది. ఈ రికార్డ్ లో మాత్రం మహేష్, బన్నీని దాటించి మరీ సమంత టాప్ లో నిలిచింది అని ఫ్యాన్స్ అంటున్నారు.

Read More: విజయ్ దళపతి క్రేజ్ మామూలుగా లేదుగా.. రీ రిలీజ్ లో ఏకంగా అన్ని కోట్లు సాధించి అలా?

ట్రెండింగ్ వార్తలు